జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రత్యేక కృతజ్ఞతలు..
మండల విద్యాధికారి జి స్వర్ణజ్యోతి..
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండల అరుంధతి నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో నిలువ నీటి సమస్య పరిష్కారం అయిందని మండల విద్యాధికారి జి స్వర్ణ జ్యోతి తెలిపారు. వర్షాకాలం వర్షాలు మరియు పాఠశాల ప్రక్కనే ఉన్న ఊట చెరువు కారణంగా నిత్యం నిల్వ నీరు ఉండే సమస్య ఏర్పడిందన్నారు. ప్రతి సంవత్సరం తాత్కాలిక పరిష్కారం పరిష్కారం చేశామని మండల విద్యాధికారి జి స్వర్ణజ్యోతి తెలిపారు. ఈ విద్య సంవత్సరం అధిక వర్షాలు కారణం గా గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్లు నిల్వ ఉండే సమస్య తీవ్రంగా ఉన్నదని తెలిపారు. ఇట్టి సమస్య మూలంగా విద్యార్థుల చదువులకు ఆటంకంగా ఏర్పడిందన్నారు. నిత్యం సెలవులు ఇచ్చే పరిస్థితి ఉండేది అన్నారు. నిధులు కొరత ఉన్నప్పటికీ ఈ సమస్యని మండల స్థాయి అధికార యంత్రాంగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సూచన మేరకు సింగరేణి యాజమాన్యం తో మాట్లాడారని తెలిపారు. మట్టిని ట్రాక్టర్లు ద్వారా పాఠశాల ఆవరణలో పోయించటం జరిగిందన్నారు. గత అనేక సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న సమస్యను పరిష్కారం చేసిన జిల్లా కలెక్టర్ కి, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి, మణుగూరు మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారులకు , సింగరేణి యాజమాన్యం వారికి మరియు స్థానిక గ్రామ పంచాయితీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి జి. స్వర్ణ జ్యోతి, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదములు తెలిపారు.
పాఠశాలలో నిలువ నీటి సమస్య పరిష్కారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES