Sunday, October 19, 2025
E-PAPER
Homeజిల్లాలుజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయింపులో ఎమ్మెల్యేల నిర్లక్ష్యం..

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయింపులో ఎమ్మెల్యేల నిర్లక్ష్యం..

- Advertisement -

20 ఏళ్లుగా ఆశగా  జర్నలిస్టుల ఎదురు చూపులు 
నవతెలంగాణ – అచ్చంపేట
వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో పాలక ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అచ్చంపేటలో జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం గత 20 ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. పాలన వ్యవస్థలో భాగంగా ఎమ్మెల్యేలు జర్నలిస్టులను పావులుగా వాడుకుంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు జర్నలిస్టులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కనికరించడం లేదు.  2004లో కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నారు. అప్పుడు కూడా జర్నలిస్టులు ఇళ్లస్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయినా కనికరించలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి పోతుగంటి రాములు ఎమ్మెల్యేగా 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో పి. రాములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు 10 మంది పనిచేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశారు. కానీ ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు.

2014 జూన్ 2 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి 2014, 2019 లలో రెండుసార్లు గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు.10.ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులను ఎంతో మభ్య పెట్టాడు. ఆశ కల్పించాడు. కనకాల మైసమ్మ దేవాలయం ప్రాంగణంలో కచ్చితంగా ఇండ్ల స్థలాలు కేటాయిస్తానని జర్నలిస్టులకు హామీ కూడా ఇచ్చాడు మర్చిపోయాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్థలం కేటాయిస్తున్నామని శంకుస్థాపన పూజ కార్యక్రమం కూడా చేయడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ముందడుగు పడలేదు.

2023లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ జర్నలిస్టులు ఇళ్లస్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హాజీపూర్ ఎక్స్ రోడ్ లో ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. కానీ రెండేళ్లు గడుస్తున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం  అడుగు ముందుకు పడడం లేదు. దీంతో జర్నలిస్టులు నిరాశతో ఉన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: కాలూరి శ్రీను, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందే విధంగా కథనాలు రాస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జర్నలిస్టులకు పాలక ఎమ్మెల్యేలు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కృషి చేయాలి. జర్నలిస్టుల పట్ల ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేయడం. పి రాములు, గువ్వల బాలరాజు, వంశీకృష్ణ  ముగ్గురు ఎమ్మెల్యేలు ఇళ్లస్థలాల ఆశ కల్పించి జర్నలిస్టులకు నిరాశ కల్పించారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సానుకూలంగా స్పందించి జర్నలిస్టులకు కేటాయించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -