- Advertisement -
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
చెడుపై విజయం సాధించడమే దీపావళి పండుగని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీపావళి పండుగ పురస్కరించుకుని మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చికటిపై వెలుగు సాధించిన ప్రతికయే దీపావళని, నరకాసురుణ్ణి సంహరించిన తరువాత ప్రజలు చేసుకునే సంబరమే దీపావళిని తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని,పెద్దల పర్యవేక్షణలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
- Advertisement -