కథానాయిక సంయుక్త తొలిసారి ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. యోగేష్ కెఎంసి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి విజయ వంతమైన చిత్రాలు అందించిన నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్‌తో కలిసి చేస్తున్న ఆరవ సినిమా ఇది. సంయుక్త స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సింధు మాగంటి సహ నిర్మాత. ఆదివారం మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ది బ్లాక్ గోల్డ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ నేడు (సోమవారం) విడుదల కానుంది.
దర్శకుడు యోగేష్ కెఎంసి థ్రిల్లర్ జానర్‌కి కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ ప్రేక్షకులకు థ్రిల్ చేయబోతున్నారు. సంయుక్త డైనమిక్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో ఆమె అద్భుతమైన స్టంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి డీవోపీ: ఎ.వసంత్, సంగీతం: సామ్ సిఎస్, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, కథ – డైలాగ్స్: యోగేష్, ప్రసాద్ నాయుడు, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: మధు విప్పర్తి, యాక్షన్: రామకృష్ణ, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి.
థ్రిల్ చేసే ‘ది బ్లాక్ గోల్డ్’
- Advertisement -
- Advertisement -