లెజెండరీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఎంవీ రఘు భారతీయ సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థాన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంవీ రఘు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1974లో కెరీర్ మొదలుపెట్టిన ఎంవీ రఘు, ‘కళ్లు’ రఘుగా గుర్తింపు పొందారు. ఆయన సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ‘స్వాతిముత్యం, సిరివెన్నెల, సితార, అన్వేషణ’ వంటి చిత్రాలు ఆల్ టైమ్ క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. ఎంవీ రఘు రూపొందించిన ‘కళ్లు’ సినిమా ఆయనకు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డ్‌తో పాటు నాలుగు నంది అవార్డ్స్ తీసుకొచ్చింది.
ఎంవీ రఘు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ,’ఎంవీ రఘు ఎందరో గొప్ప దర్శకులతో, టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేశారు. టెక్నీషియన్‌గా ఇప్పటికీ అదే స్పిరిట్‌తో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘నేను ‘సితార’ సినిమాలో హీరోగా సెలెక్ట్ కావడానికి ఒక కారణం రఘు. ఆయన ఫిలిం ఇండిస్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ అద్భుతం. ఆయనతో ‘అమెరికా అల్లుడు’ అనే మూవీ చేశాను’ అని నటుడు సుమన్ చెప్పారు. నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ,’చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్టిస్టులు ఉన్నారేమో గానీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. ఆయన తొలినాళ్లలో ఎంత వినయంగా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు’ అని అన్నారు.
ఎంవీ రఘు మాట్లాడుతూ,’నా 50 ఏళ్ల కెరీర్‌లో ఎంతోమంది గొప్ప గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అదష్టం దక్కింది. పీఎల్ రారు, మార్కస్ బార్ ట్ల్లేతో వర్క్ చేశాను. నా గురువు వీఎస్‌ఆర్ స్వామితో, ఆ తర్వాత గోపాల్ రెడ్డితో పనిచేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా ఎంతోమంది దిగ్గజాలతో పనిచేసే అదష్టం దక్కింది. అందరి ప్రోత్సాహం వల్లే నేను గొప్ప పేరు తెచ్చుకోగలిగాను. నేను పని రాక్షసుడిని. ఏదైనా సరిగ్గా రాకుంటే రాజీ పడను. మన దేశం నుంచి ఆస్కార్‌కు వెళ్లిన ఒకే చిత్రం ‘స్వాతిముత్యం’కు నేను సినిమాటోగ్రాఫర్‌ను. రెండేళ్ల కిందట ఆస్కార్ కమిటీలో మెంబర్‌ను. ఎంతోమంది ఈతరం పిల్లలకు సినిమాటోగ్రఫీలో శిక్షణ ఇస్తుండటం సంతోషంగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌గా నేను ఏదైనా సాధించాను అంటే అందులో దర్శకుడు వంశీ పాత్ర కీలకం’ అని అన్నారు.
ఘనంగా ఎం.వి.రఘు గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్
- Advertisement -
- Advertisement -