- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల బరిలో నుంచి ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) తప్పుకుంది. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తాము నిర్ణయ తీసుకున్నట్లు తెలిపింది. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. బీహార్‌లో తొలివిడుత నామినేషన్ల గడువు అక్టోబర్ 17న ముగిసింది. అదేవిధంగా రెండో విడతకు సోమవారమే చివరి రోజు. నవంబర్ 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు.
- Advertisement -