- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుపతి, కడప, ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అక్కడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
- Advertisement -