- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. కాగా రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై క్యాబినెట్ చర్చించనుంది. పాత పద్దతిలో ఎన్నికలకు వెళ్లాలా లేక 42 శాతం రిజర్వేషన్లతో వెళ్లాలా అనేది దానిపై చర్చించనుంది. అలాగే ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్సుకు రేపు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -