Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోల్డెన్ జూబ్లీ ఇంటర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: యుఎస్ఎఫ్ఐ

గోల్డెన్ జూబ్లీ ఇంటర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: యుఎస్ఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రభుత్వానిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం  భారత్ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న జిల్లా కేంద్రంలోని గోల్డెన్ జూబ్లీ గర్ల్స్ ఇంటర్మీడియట్ కళాశాల పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం స్పందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని దీనివలన పేద, మధ్యతరగతి విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అన్నారు.

అదేవిధంగా జిల్లా కేంద్రంలో గల గోల్డెన్ జూబ్లీ బాలికల కళాశాల షిఫ్టింగ్ అనుమతి పొంది దాదాపు మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు షిఫ్టింగ్ చేయకుండా పాత భవనంలోనే క్లాసులు నిర్వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని అన్నారు. అలాగే రానున్న ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల కొరకు పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది అయినా ఇప్పటివరకు గోల్డెన్ జూబ్లీ యాజమాన్యం కళాశాలను తరలించకుండా అక్కడే క్లాసులు నిర్వహించడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గారు స్పందించి గోల్డెన్ జూబ్లీ ఇంటర్మీడియట్ కళాశాలను సీజ్ చేసి గోల్డెన్ జూబ్లీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నిజాంబాద్ నగర అధ్యక్ష కార్యదర్శులు గణేష్,పోషమైన మహేష్, యూఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు వేణు, మారుతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -