నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచమంతా ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బాట పడుతోంది. అనేక సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులకు చెల్లించే ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయి. తాజాగా గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగుల స్థానంలో ఏఐని భర్తీ చేయాలని భావిస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి కీలక సమాచారం ఉన్న డాక్యుమెంట్లు లీకైనట్లు తెలిపింది. 2033 నాటికి దాదాపు 5,00,000 మంది ఉద్యోగులకు బదులుగా రోబోలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అమెజాన్‌కు చెందిన రోబోటిక్స్ టీమ్ కంపెనీ మొత్తం కార్యకలాపాల్లో 75 శాతం ఆటోమేషన్‌కు మార్చడానికి పరిశీలిస్తోంది. దీనివల్ల 2027 నాటికి సుమారు 1.60 లక్షల నియామకాల బదులు ఏఐని ఉపయోగించనుంది. అంతేకాకుండా మనుషుల స్థానంలో ఏఐని తీసుకోవడం వల్ల అమెజాన్‌కు 2027 నాటికి దాదాపు 12.6 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 1.10 లక్షల కోట్లు ఆదా చేసుకోవచ్చని భావిస్తోంది. ఇప్పటికే కంపెనీ తన వేర్‌హౌస్ విభాగంలో పెద్ద ఎత్తున రోబోలను వాడుతోంది. దీన్ని మరింత వేగవంతం చేయాలని చూస్తోంది. తద్వారా 2033 కల్లా వస్తువుల అమ్మకాలను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికోసం లక్షలాదిని నియమించుకోకుండా కార్యకలాపాలను రోబోలతో నిర్వహించనుంది.
స్పందించిన అమెజాన్
న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్న అంశాలు అసంపూర్ణంగా ఉన్నాయని, కంపెనీ నియామక ప్రక్రియ గురించి స్పష్టంగా పేర్కొనలేదని అమెజాన్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దీని గురించి స్పందించిన అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్.. లీకైన డాక్యుమెంట్లు కంపెనీలోని ఓ టీమ్ అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. అమెజాన్ గతంలో మాదిరిగానే నియామకాలను చేపడుతోంది. రాబోయే హాలిడే సీజన్ కోసం అమెరికాలో 2,50,000 మంది సిబ్బందిని నియమించాలని చూస్తున్నట్టు స్పష్టం చేశారు.
5 లక్షల మంది ఉద్యోగులను రోబోలతో భర్తీ చేస్తున్న అమెజాన్..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES