ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్క్ ల పంపిణి చేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – కుభీర్
ముధోల్ నియోజక వర్గంలో ఉన్న బడుగు బలహీన ప్రజలకు అండగా ఉండేందుకు కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బుధువారం మండల కేంద్రమైన కుభీర్ లోని రైతు వేదికలో 101మంది కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్క్ ల మండల నాయకులతో కలసి పంపిణి కార్యక్రమంలో పాల్గొని చెక్క్లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముధోల్ నియోజక వర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధి కి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. అదే విదంగా దక్షణ తెలంగాణా రాష్ట్రములో ఉన్న ప్రసిద్ధి గాంచిన బాసర సరస్వతి దేవస్థానానికి అన్ని రంగాల్లో అభివృద్ది చేసేలా కృషి చేస్తానని అన్నారు.
దింతో పాటు బాసర నుంచి మహుర్ వరకు రెండు వరసల రహదారి నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు చే్వపట్టడం జరిగిందని అన్నారు.ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న పేద మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందె పథకాలు ప్రజలకు అందించేందుకు నవంతుగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చెర్మన్ ఆనంద్ రావు పటేల్ బీజేపీ మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్ బైంసా ఆత్మ కమిటీ చేర్మెన్ సిద్ధం వివేకానంద సీనియర్ నాయకులు సౌంలీ రమేష్ బంక బాబు యువ నాయకులు పురం శెట్టి రవికుమార్ మండల తహసీల్దార్ శివరాజ్ ఎంపీడీఓ సాగర్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు కళ్యణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.