ఎక్పైజ్ శాఖ కార్యదర్శి రిజ్వీ వాలంటరీకి సర్కార్ ఆమోదం
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనలో బాగంగానే ఈ బదిలీ చేశామని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న ఎం.రఘునందన్ రావుకు వాణిజ్య, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జెన్‌కో సీఎండీ హరీశ్‌కు దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా, ఐటీ అదనపు కార్యదర్శిగా ఉన్న భవేష్ మిశ్రాకు భూగర్బ గనుల శాఖ డైరెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా వాలంటరీ రిటైర్మెంట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది.