- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే గిల్, కోహ్లీ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో క్రిజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసి రోహిత్ నిలకడగా ఆడుతూ అర్ద సెంచరి పూర్తి చేశాడు. భారత్ ప్రస్తుతం 28 ఓవర్లకు 129/2 పరుగులు చేసింది. రోహిత్ 69, శ్రేయస్ అయ్యర్ 50 అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్జేవియర్ 2 వికెట్లు తీశాడు.
- Advertisement -