- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీష్ రెడ్డి ఎర్రబెల్లి దయాకరావు, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ వారితో చర్చించారు. ఎన్నిక గడువు సమీపిస్తుండటంతో ఇక నుంచి ప్రచారం ముమ్మరం చేయాలని చెప్పినట్లు సమాచారం.
- Advertisement -