Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాబోయ్‌.. కోతులు..

బాబోయ్‌.. కోతులు..

- Advertisement -

– ప్రాణాలు తీస్తున్న పట్టింపేది 
– పిల్లలు, వృద్ధులపై దాడులు
– ఇండ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ
– కోతుల నియంత్రణలో అధికారుల విఫలం
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం 
ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు సుశీలమ్మ 20 రోజుల క్రితం తన ఇంటి దగ్గర ఆరు బయట ఉండగా ఒక్కసారిగా కోతుల గుంపు వచ్చి ఆమెపై దాడి చేశాయి. కాలు, చేతులు, వీపు పై తీవ్ర గాయాలయ్యాయి. సుశీలమ్మ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే నగరంలో ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ.. బుధవారం మృతి చెందింది. 

రంగారెడ్డి జిల్లా కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. కోతులు గుంపులుగుంపులుగా బయలుదేరి గ్రామాల్లో విరుచుకుపడుతున్నాయి. ఇండ్లు, దుకాణాలలో తినుబండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్లచెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలపై దాడులకు దిగుతూ గాయ పరుస్తున్నాయి. వృద్ధులు, చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన తమకు సంబంధం లేదని పంచాయతీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. చందాలు వేసుకుని కోతులను పట్టించాలని ప్రజలకు ఉచ్చిత సలహాలు ఇస్తున్నారు. ఇది రంగారెడ్డి జిల్లా కేంద్రమైన ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో కోతుల బెడద ప్రజలు నరకం చూస్తున్నారు. 

ఇండ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ..
అడవిలో జీవించాల్సిన కోతులు ఊర్లమీద పడుతున్నాయి. అటవీ ప్రాంతాలు రోజురోజుకు తగ్గి పోవడం వాటికి అడవిలో ఆహారం లభించక గ్రామాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. ఇండ్లలో తయారు చేసుకున్న భోజనలతో పాటు పప్పు దినుసులు పట్టుకెలుతున్నాయి. కిరణా షాపులు, పండ్ల దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అరుబయట ఎండబెట్టిన పప్పు దినుసులు, ఇతర ఆహర పదర్థాలను వదలటం లేదు. ఇండ్లలో ఉన్న మామిడి, జామ, బొప్పాయి ఇతర పండ్ల చెట్లు, కూరగాయాల చెట్లను సైతం వదలకుండ ధ్వంసం చేస్తున్నాయి.

భయందోళనలో ప్రజలు..
కోతుల బెడద రోజురోజుకు ఎక్కువ కావడంతో పట్టణ వాసులు భయందోళనలకు గురవుతున్నారు. ఇండ్లలో చొరబడి వీరంగం సృష్టిస్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో అవి ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాలలో కోతి కాటుకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కోతుల దాడులతో పరిస్థితి విషమించి మృత్యువాత పడుతున్నారు. మిద్దెల మీద గుంపులు గుంపులుగా ఒకచోట చేరి వచ్చిపోయే వారిపై పైపైకి వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతుల బెడద తీవ్రం కావడంతో కొంతమంది టపాసులు, పెద్ద శబ్ధాలు చేసి వాటిని తరిమి వేస్తున్నారు.

నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలి..
పట్టణంలో కోతుల నియంత్రణ కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోతులను బందించి పట్టణం నుంచి అటవీప్రాంతాలకు తరలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు: పి.జగన్, సీపీఐఎం జిల్లా కమిటీ సభ్యులు 
కోతుల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. నిధుల కొరత కారణంగా తాము ఏమి చేయలేమని చేతులు దులుపుకుంటున్నారు. పైగా గ్రామస్తులు చందాలు వేసుకుని కోతులను పట్టించాలని ప్రజలకు ఉచ్చిత సలహాలు ఇస్తున్నారు. ప్రాణాలు పోతున్న తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. పోల్కంపల్లి, రాయపోల్, ముకునూర్, కప్పాడు తదితర గ్రామాల్లో కోతులు దాడులతో అనేక మంది గాయాల పాలు కాగా, చిన్నారులు, వృద్ధులు చనిపోయారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే కోతుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. లేకుంటే  త్వరలోనే ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తాం

కోతులతో ఇబ్బందులు పడుతున్నాం: గూడెం శ్రీనివాస్, పోల్కంపల్లి
కోతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇండ్లలోకి చొరబడి వస్తువులను చిందర వందరగా పడేసి వీరంగం సృష్టిస్తున్నాయి. వంటపాత్రాలు, ఆహార పదర్థాలు, కూరగాయాలు ఎత్తుకెళుతున్నాయి. వీటిని తరిమేందుకు ప్రయత్నిస్తే దాడులకు దిగుతున్నాయి. తమ గ్రామంలో కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. అధికారులు వెంటనే నియంత్రణ చర్యలు చేట్టాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -