బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్
నవతెలంగాణ – భూపాలపల్లి టౌన్
నమస్తే తెలంగాణ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడి సరికాదని,బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ,దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగోస్థంభంగా ఉన్న మీడియాపై బెదిరింపులకు దిగటం మంచిపద్దతి కాదని,సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్ఛ పత్రికలకు ఉంటుందని, పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే, వాటికి ఖండనలు ఇవ్వటం, వివరణలు ఇవ్వటం చేయాలి కానీ బెదిరింపులకు పాల్పడటం, భౌతిక దాడులకు దిగటానికి ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. భావప్రకటనా స్వేఛ్ఛ పై దాడి సరికాదని, తక్షణమే పత్రికా కార్యాలయంపై దాడికి దిగిన వారిని అరెస్టు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి ఉసిగొల్పిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతల తీరు సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES