- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో పెద్ద సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. రోడ్ నెంబర్ 12లో ఉన్న R-Inn హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించారు. ఈ రైడ్‌లో ముగ్గురు యువతులు, వ్యభిచారం కోసం వచ్చిన ఏడుగురు విటులు, ఇంకా ఈ రాకెట్ నిర్వాహకుడు షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన యువతుల్లో ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ముఠా కార్యకలాపాలు, ఇతర లింకుల గురించి పోలీసులు షరీఫ్‌ను, మిగతా వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -