నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు ఏరియా సింగరేణి అన్ని విభాగాల కాంటాక్ట్ కార్మికులకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఈ ఎస్ ఐ వైద్య సేవలు అందుబాటులోకి తేవటంపట్ల కాంట్రాక్ట్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా వీలైనంత త్వరగా మణుగూరులో ఈఎస్ఐ డిస్పెన్సరీ కూడా ప్రారంభించాలని, సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల కూడా ఈఎస్ఐ వైద్య సేవలు వర్తింప చేయాలని కోరుతూ ఏరియా జిఎం దుర్గం రాంచందర్ కి, ఈఎస్ఐ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ సాయికుమార్ కి గురువారం జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఈ ఎస్ ఐ వైద్య సేవల రిజిస్ట్రేషన్ సందర్భంగా వినతి పత్రం అందజేశారు.
అదేవిధంగా ఈ వైద్య సేవలు మణుగూరులో పూర్తిస్థాయిలో ప్రారంభం అయ్యేంతవరకు ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభించాలని సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సెక్యూరిటీ గార్డులకు కూడా ఈఎస్ఐ వైద్య సేవలు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు నాజర్ పాషా అంగోత్ మంగీలాల్, చల్లా కాంతారావు, శ్రీకాంత్,సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు, డి సుధాకర్, రామ్ అవతార్, షేక్ రబ్బాని సూపర్వైజర్లు మరియు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులో తేవటం పట్ల కాంట్రాక్ట్ కార్మికులు హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES