Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు ...

ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు …

- Advertisement -

సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు
నవతెలంగాణ – ఆర్మూర్ 

ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మైలారం బాలు గురువారం సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినారు. ఫిర్యాదు చేస్తే ఏం వస్తుంది పైసల ఇస్తా తీసుకోండి అంటూ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డి రాయబారం చేస్తున్నారని ఆరోపించారు. నెలల నుండి పిర్యాదు చేస్తున్న అధికారులు నిర్మాణాలు ఆపకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది అని అన్నారు.

పట్టణంలోని  పెర్కిట్ కొటార్మూర్ లో సర్వే నంబర్ 202/3 అసైండ్ మెంట్ భూమి ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డి అనే వ్యక్తి అందులో ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు అక్రమ నిర్మాణాలకు మునిసిపల్ కమీషనర్  24 ఇండ్లకు పర్మిషన్ మంజూరు చేశారని, దీని విషయం ఈ రోజు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేస్తున్న ఇండ్ల పర్మిషన్ రద్దు చేయాలి అని అక్రమ కట్టడాలను నిలిపివేయాలని మున్సిపల్ కమీషనర్ ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్  తక్షణం నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారని అన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు పిర్యాదు చేసిన వారిని వారి స్నేహితులతో రాయ భారాలు చేయడం చేస్తున్నారు. ప్రభుత్వ భూమి లో కడితే పిర్యాదు చేస్తే మీకు ఏం వస్తది డబ్బులు తీసుకోండి అని అనడం అందరికీ డబ్బులు ముట్టినవి.. ఎవరు ఏం చేయలేరు అని అహంకారం మాట్లాడుతున్న ఇలాంటి వ్యాపారి మీద చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమి ని కాపాడే వరకు అధికారులు  ప్రభుత్వ భూమి మీద దృష్టి సారించాలి. అధికారులు పనులు నిలిపివేయాలని చెప్పిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు  పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూమిని కాపాడాలని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -