ఆందోళనలో రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి,పల్లెల్లో పేరుకపోయిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన జిపిఓలు (గ్రామ పాలన అధికారులు) లను సెప్టెంబర్ 5న నియమించి,నియమక పత్రాలు అందజేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో వారికి శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. అయితే క్లస్టర్ ఒక్కరి చొప్పున మండలంలో ఏడూ క్లస్టర్లకు ఏడుగురు జిపిఓ లను నియమించారు. ఇంతవరకు బాగానే ఉన్న గ్రామాల్లో, తహశీల్దార్ కార్యాలయంలో వీరి కోసం రైతులు పడిగాపులు కాస్తున్న వారి ఆచూకీ దొరకడం లేదని భూ సమస్యలున్న బాధిత రైతులు ఆందోళనకు గురివుతున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి భూ చట్టం,గ్రామాల్లో నియమించిన జిపిఓలతో తమ భూ సమస్యలు తీరుతాయని ఆశపడుతున్న రైతులకు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిపిఓలు ఎక్కడ ఉంటారు.. వారి సమయ పాలన తెలియ చేత పత్రాలు పట్టుకొని గ్రామ పంచాయితీల్లో, తహశీల్దార్ కార్యాలయనికి నిత్యం ప్రదక్షణలు చేస్తున్నామని బాధిత రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పట్టించుకోని జిపిఓ లు రైతులకు ఏ సమయంలో,ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియజేయాలని మండల రైతులు కోరుతున్నారు.
జిపిఓలు ఎక్కడ.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES