Thursday, November 13, 2025
E-PAPER
Homeఖమ్మంఈఎస్ఐ వైద్య సేవలు.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పాలిట ఒక వరం

ఈఎస్ఐ వైద్య సేవలు.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పాలిట ఒక వరం

- Advertisement -

జనరల్ మేనేజర్  దుర్గం రామచందర్ ..
నవతెలంగాణ – మణుగూరు
ఈ ఎస్ ఐ వైద్య సేవలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పాలిట ఒక వరమని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అన్నారు. గురువారం మణుగూరు ఏరియా జిఎం కార్యాలయం సమావేశ మందిరంలో కాంట్రాక్టర్ల మరియు కాంట్రాక్ట్ కార్మికుల ఈఎస్ఐఐ వైద్య సేవల కొరకు రెండు రోజులపాటు నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను జీఎం దుర్గం రాంచందర్  లాంచనంగా ప్రారంభించినారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పాలిట ఈఎస్ఐఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ వైద్య సేవలు ఒక వరం. లాంటిదని, బహుళ ప్రయోజనకర పథకం అని, కాంట్రాక్ట్ కార్మికులకు ఎంతగానో లబ్ధి చేకూర్చుతుందని చెప్పారు. ఈ పథకం అమలుకు కృషిచేసిన సింగరేణి సి ఎండి  ఎన్. బలరాం ఐఆర్ఎస్ కృషి ప్రశంసనీయమని అన్నారు.

వైద్యం ఈనాడు ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, ఇలాంటి సమయంలో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు వారి కుటుంట సభ్యులకు వర్తించే విధంగా మెరుగైన వైద్య సదుపాయాలు మరియు అనేక సంక్షేమ పథకాలు ఈఎస్ఐఐలో ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు మెడికల్ కాలేజీల్లో సీట్ల ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచి అంశమని అన్నారు.

కాంట్రాక్ట్ కార్మికులకు ఇది బహుళ ప్రయోజనకర పథకం కావున ప్రతి కాంట్రాక్టర్ తమ కార్మికులను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మణుగూరులో ఒక డిస్పెన్సరిని ప్రారంభించాలని ఈఎసిఐ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఈఎస్ఐ అధికారులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ ఎస్ ఐ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ సాయి కుమార్  మాట్లాడుతూ ఈఎస్ఐఐ వైద్య సేవల ప్రయోజనాలను వివరించారు. బీమా చేయబడిన కార్మికులు మరియు వారి కుటుంటాలకు వివిధ రకాల వైద్య సివలను అందిస్తుందని తెలిపారు. చికిత్సలో సాధారణ వైద్య సంప్రదింపులు, చికిత్స, మందులు, నిపుణుల సంప్రదింపులు, ఆసుపత్రి చేరిక సేవలు ఉంటాయని చెప్పారు. ఇసిపేషంటే సేవలు, నిపుణుల సేవలు, మందులు మరియు ఇంటెకన్లు ఉచితంగా లభిస్తాయని, ఆయుష్ వైద్య పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.ఇతర ప్రయోజనాలలో ఉద్యోగం కోల్పోయిన వారికి నగదు భృతి, మరణించినవారి ఆధారపడిన వారికి భృతి, మరియు 21,000 రూపాయలలోపు నెలవారీ జీతం పొంది కార్మికులకు ఈ సేవలు వర్తిస్తాయని వివరించారు.

ఈ పథకం కాంట్రాక్ట్ కార్మికుల పాలిట లబ్ది చేకూర్చే మంచి పథకమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం దుర్గం రాంందర్ , ఎస్. ఓ టు జీఎం బి. శ్రీనివాసాచారి , డీజీఎం ఏర్పనల్ ఎస్. రమేష్ , కార్మిక సంఘాల నాయకులు వై. రాజగోపాల్, వత్సవాయి కృష్ణంరాజు , ఎస్.డి.నా సర్పాపా ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మకులు ఈ ఎస్ఐ ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ సాయి కుమార్ ని పుష్పగుచ్చం మరియు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్. ఓ టు జిఎం  బి. శ్రీనివాసాచారి, డిజిఎం పర్సనల్ ఎస్. రమేష్, వై.వి.ఎల్. వం ప్రసాద్, ఎల్. తిరుపతి ఏర్సనల్ మేనేజర్ కార్మిక సంఘాల నాయకులు కట్ల శ్రీనివాస్, సాయిల సురేష్, సివిల్ ఈ ఈ ప్రవీణ్ కుమార్, పలు గనుల సంక్షేమ అధికారులు, మేనేజ్మెంట్ ట్రైనీలు ఎస్. చంద్ర కిరణ్, సిహచ్, సాయి శ్వేత, బి. వంశీకృష్ణ, డి. సాయి మౌనిక మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -