Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంపౌండ్ వాల్ కూల్చిన మున్సిపల్ అధికారులు 

కాంపౌండ్ వాల్ కూల్చిన మున్సిపల్ అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల సిఎస్ఐ కాలనీలోని ఓ ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్  గురువారం మున్సిపల్ అధికారులు కూల్చివేయడం జరిగింది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ మీడియాతో మాట్లాడుతూ ఆలేటి రాములు తన ఇంటికి సంబంధించిన ప్రహరీ గోడ రోడ్డును ఆక్రమించి నిర్మించడం జరిగిందన్నారు. ప్రహరీ గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళగా ప్రహరీని తొలగించాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో కలిసి కమిషనర్ కొడారి సుష్మ కాంపౌండ్ వాల్ను జెసిబి సహాయంతో తొలగించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -