బ్రసిలియా : చమురు అన్వేషణ కోసం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష పార్టీలు అడ్డుతగులుతున్నాయి. వచ్చే నెల 10-21 తేదీల మధ్య ఉత్తర బ్రెజిల్‌లోని పారా రాష్ట్ర రాజధాని బెలెమ్‌లో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి సదస్సు (కాప్30) జరగబోతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై పోరాడాల్సిందిగా ప్రపంచ నేతలకు లూలా పిలుపునిచ్చారు. ఒకవైపు వాతావరణ మార్పులను గురించి మాట్లాడుతూ మరోవైపు పర్యావరణానికి ముప్పు కలిగించే చమురు డ్రిల్లింగ్‌లను అనుమతించడమేమిటని విమర్శ కులు ఆయనను ప్రశ్నించారు.
అయితే వాతా వరణ మార్పులపై పోరాడాలంటే నిధులు అవసరమని, చమురు నిల్వల కారణంగా ఆదాయం పెరుగుతుందని లూలా వాదిస్తు న్నారు. బ్రెజిల్‌లో చమురు అన్వేషణకు లైసెన్స్ పొందే ప్రక్రియ చాలా కఠినతరంగా ఉంటుంది. ‘మన చమురు సార్వభౌమత్వ భవిష్యత్తుకు అమెజాన్ నదీ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. దానిని బ్రెజిల్ విస్మరించదు’ అని ఇంధన శాఖ మంత్రి అలెగ్జాండర్ సిల్‌వెయినా తెలిపారు. ‘ప్రపంచం చమురు కావాలని డిమాండ్ చేసినంత కాలం ఎవరో ఒకరు దానిని సరఫరా చేయాల్సిందే. ఈ విషయంలో బ్రెజిల్ ముందుంటుంది’ అని చెప్పారు. ప్రపంచంలో చమురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో బ్రెజిల్‌ది ఎనిమిదో స్థానం. చమురు అన్వేషణను విస్తరించాలన్న ప్రణాళికను లూలా గట్టిగా సమర్ధిస్తున్నారు.
చమురు అన్వేషణ విస్తరణకు బ్రెజిల్ ప్రణాళికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



