- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రఖ్యాత భారతీయ ప్రకటన నిపుణుడు పీయూష్ పాండే (70) కన్నుమూశారు. ఒగిల్వీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా పని చేసిన పాండే భారతీయ ప్రకటన పరిశ్రమలో మోడర్న్ అడ్వర్టైజింగ్ స్థాపకుడిగా పేరొందారు. స్థానిక భాష, భావోద్వేగాలను ప్రాధాన్యం ఇచ్చే విప్లవాత్మక ప్రచారాలు సృష్టించారు. 2014లో ప్రధాని మోడీకి “అబ్ కి బార్ మోడీ సర్కార్” ఎన్నికల నినాదం ఆయన రచనే. 2016లో పద్మశ్రీ, 2018లో కేన్స్ లయన్స్‌లో లయన్ ఆఫ్ సెయింట్ మార్క్ అవార్డులు అందుకున్నారు.
- Advertisement -



