నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ‘విక్టోరియా పార్లమెంట్’ను సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ ‘లీ తార్లామిస్’, పార్లమెంటరీ సెక్రటరీ ‘షీనా వాట్’ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్‌ను వారికి వివరించారు.
ట్రాన్స్‌పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ – విక్టోరియా’ మధ్య ఇన్‌స్టిట్యూషనల్ కొలాబరేషన్‌ను పెంపొందించేందుకు చొరవ చూపాలని కోరారు. ప్రగతిశీల విధానాలను అనుసరిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న ‘తెలంగాణ’ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ‘లీ తార్లామిస్’, ‘షీనా వాట్’ తెలిపారు. ‘తెలంగాణ- విక్టోరియా’ మధ్య ద్వైపాక్షిక సహాకారాన్ని పెంపొందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
‘విక్టోరియా పార్లమెంట్’ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



