Saturday, October 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆరో తరగతి విద్యార్థిపై సీనియర్ల లైంగిక దాడి..

ఆరో తరగతి విద్యార్థిపై సీనియర్ల లైంగిక దాడి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఖానాపూర్ మండలంలోని మస్కాపుర్ బీసీ సంక్షేమ విద్యార్థి వసతి గృహంలో చోటుచేసుకుంది.

మస్కాపుర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్థానిక బీసీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడిని నిద్రలేపారు. వసతి గృహం పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం గురించి బాధితుడు తన కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాఠశాలకు వచ్చి తమ కుమారుడికి టీసీ తీసుకుని, హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి తీసుకెళ్లారు.

మరోవైపు, ఈ విషయాన్ని తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోనగిరి నరేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన హాస్టల్ వార్డెన్ ప్రకాశ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి జరిగిన ఘటనను వివరించారు. ఆ తర్వాత ఈ నెల 23న వారిద్దరికీ టీసీలు ఇచ్చి పాఠశాల నుంచి పంపించివేశారు. ఈ వసతి గృహంలో, పాఠశాలలో ఇలాంటి ఘటనలు గతంలోనూ పలుమార్లు జరిగాయని, కానీ యాజమాన్యం వాటిని బయటకు పొక్కకుండా తొక్కిపెడుతోందన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -