Saturday, October 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమద్యం మత్తులో బైకర్ శివశంకర్..సీసీ కెమెరా దృశ్యాలు వైరల్‌

మద్యం మత్తులో బైకర్ శివశంకర్..సీసీ కెమెరా దృశ్యాలు వైరల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వీ కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడానికి బైకర్ శివశంకర్ ఆఖరి వీడియో లభ్యమైంది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు అతను ఒక పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. ఆ సమయంలో శివశంకర్ తో మరో యువకుడు కూడా ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ పెట్రోల్ పోయించుకోకుండా.. శివశంకర్ ఒక్కడే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. పెట్రోల్ బంక్ నుంచి వెళ్లే క్రమంలో బైక్ తో విన్యాసాలు చేశాడు.

అప్పటికే మద్యం సేవించి ఉన్న శివశంకర్.. పెట్రోల్ బంక్ నుంచి వెళ్తుండగా.. అక్కడే బైక్ స్కిడ్ అయింది. బైక్ ప్రమాదానికి గురైన ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ పెట్రోల్ బంక్ ఉంది. సీసీటీవీలో రికార్డైన సమయం 24 తేదీ తెల్లవారుజామున 2.23 గంటలుగా ఉంది. తెల్లవారుజామున 3 గంటల తర్వాత శివశంకర్ బస్సు ప్రమాదానికి గురై మరణించాడు. శివశంకర్ రాంగ్ రూట్ లో రావడం, ఆ సమయంలో బస్సు 120 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుండగా.. సడన్ బ్రేక్ వేసే ఛాన్స్ లేక డ్రైవర్ బైక్ ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. అంత స్పీడుమీద ఉన్న బస్సును బ్రేకులు వేసి ఆపినా.. బస్సు పల్టీలు కొట్టి అందరూ చనిపోయేవారని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -