Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ లో కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి ప్రచారం

జూబ్లీహిల్స్ లో కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి ప్రచారం

- Advertisement -

 నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.  జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే, నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని.. అందుకే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని ప్రచారం సాగిస్తున్నకసిరెడ్డి నారాయణరెడ్డి. బిజెపికి బీ టీమ్ గా బీఆర్ఎస్ పని చేస్తుందని వివరిస్తూ ఎమ్మెల్యే ప్రచారం ప్రచారానికి ఓటర్ల నుంచి మంచి స్పందన అధికార కాంగ్రెస్ కు ఓటేస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  మాట్లాడుతూ.. గత రెండురోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని కోరుతున్నాము.  మా ప్రచారానికి మంచి ప్రజాస్పందన వస్తుంది. ప్రజా స్పందన చూస్తుంటే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. నవీన్ యాదవ్ గెలుపు లాంచనమే కాంగ్రెస్ కు వస్తున్న ప్రజాస్పందన వోర్చుకోలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -