- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రాంనగర్, అంచర్ పేట్, ఆర్టీసీ x రోడ్డు, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, హఫీజ్ పేట్ ప్రాంతాల్లో తుంపరగా ప్రారంభమై క్రమంగా పెరుగుతూ భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ నుంచి సైబరాబాద్ కమిషనరేట్ మార్గంలో, ఏఎంబీ, హఫీజ్ పేట్, మాదాపూర్, జూబ్లీహిల్స్ రోడ్డు, మియాపూర్, బీహెచ్ ఈఎల్ రోడ్డులో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- Advertisement -



