Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం..!

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులందరికీ.. పోషకాహారం అందేలా చూడాలని ఐసీడీఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక అన్నారు. శనివారం మండలం కొండంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ (ఈసిసిఈ) ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ దినోత్సవంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య, సంపూర్ణ భోజనం, పిల్లల బరువు, ఎత్తు, పోషణ లోపం, బాల్యవివాహాలు, దత్తత, కిశోర బాలికల చదువు,వృత్తి విద్య కోర్సులపై అవగాహన కల్పించారు. సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా ఆకుకూరలు తీసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కల్యాణి, గర్భిలు, బాలింతలు, చిన్న పిల్లల తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -