- Advertisement -
జిల్లా కలెక్టర్ హనుమంతరావు….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
2025-27 సంవత్సరమునకు గాను ఎ4 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా ఈనెల 27వ తేదీన సోమవారం రోజున రాయగిరిలోని సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదగా జిల్లాకు సంబంధించిన (82) మద్యం దుకాణాలకు గాను (2776 )దరఖాస్తు లు స్వీకరించడం జరిగిందని అన్నారు. ఉదయం 11.00 గంటలకు లాటరీ పద్ధతి ద్వారా డ్రా తీయబడునని జిల్లా కలెక్టర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ4 మద్యం దుకాణాలకు సంబంధించి 2025-27 సంవత్సరానికి గాను మద్యం పాలసీలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు 27 న అనగా సోమవారం నాడు ఉదయం 10 గంటల వరకు వేదిక వద్దకు రాగలరని తెలిపారు.
- Advertisement -



