Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన ఉండాలి: ఏఈఓ వంశీ

కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన ఉండాలి: ఏఈఓ వంశీ

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కపాస్ కిసాన్ యాప్ పై రైతులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఏఈవో వంశీ అన్నారు. శనివారం మండల కేంద్రంలో రైతు వేదికలో గ్రామాల్లో కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్ ను రైతులు తమ మొబైల్ లో ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకొని, తద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ ద్వారా రైతులు పండించిన పత్తిని సీసీఐలో విక్రయించుకోవచ్చన్నారు. కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు ఏలాంటి సందేహాలు ఉన్న టోల్ ఫ్రీనెంబర్ 18005995779 సంప్రదించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -