నవతెలంగాణ – డిచ్ పల్లి: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద శనివారం జాగృతి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జనంబాట’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కల్వకుంట్ల కవిత ‘జనంబాట’ పేరుతో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రను తన మెట్టినిళ్లయిన నిజామాబాద్ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు. దానిలో భాగంగానే జిల్లాకు వచ్చారు. జాతీయ రహదారి అనుకొని దేవి గడ్ లోని సేవలాల్ మహారాజ్ ఆలయంలో గిరిజన మహిళ వస్త్రధానాలను ధరించి ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అనంతరం టోల్ ప్లాజా వద్ద జాగృతి కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలుకుతూ అక్కడి నుండి బైక్ కార్ల ద్వారా ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి సీనియర్ నాయకులు ఎస్ ఎ అలీమ్, సుదాం రవిచందర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌడ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ కవిత ఘన స్వాగతం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



