- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన ముగ్గురు ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కారులో మంటలు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
- Advertisement -



