- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్, భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటో షేర్ చేసిన తర్వాత గిల్ క్రిస్ట్ కు అనుకోని అదృష్టం వరించింది. ఒక్క రోజులోనే అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 24 వేలు పెరిగింది. దీంతో రోహిత్ శర్మ అభిమానుల క్రేజ్ మరోసారి ప్రపంచానికి తెలిసింది. గిల్ క్రిస్ట్ ప్రస్తుతం 8 లక్షలకు పైగా మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.
- Advertisement -



