Monday, October 27, 2025
E-PAPER
Homeఖమ్మంప్రజారవాణా మెరుగు పరచడమే లక్ష్యం

ప్రజారవాణా మెరుగు పరచడమే లక్ష్యం

- Advertisement -

– మండలంలో మరో బస్ సర్వీస్: ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రజారవాణా మెరుగే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన పాలన సాగిస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా మారుమూల ప్రాంతం అయిన కావడిగుండ్ల కు ఆయన గెలిచిన కొద్ది రోజుల్లోనే బస్ సర్వీస్ సౌకర్యం కల్పించారు.

ప్రస్తుతం అశ్వారావుపేట నుండి వెలేరుపాడు వరకు మరో బస్ సర్వీస్ ను సోమవారం ప్రారంభించనున్నారు.టీజీ ఆర్టీసీ సత్తుపల్లి డిపో నుండి అశ్వారావుపేట వయా ఊట్లపల్లి,వేదాంత పురం రామన్నగూడెం మీదుగా ఆంధ్రా లోని రామన్నగూడెం,పూచికపాడు కలుపుతూ తెలంగాణ లోని కావడి గుండ్ల కు ఒక సర్వీస్ నడుస్తుంది.

సోమవారం ప్రారంభించి బోయే సర్వీస్ సత్తుపల్లి నుండి అశ్వారావుపేట,వినాయక పురం,నారాయణపురం,గుమ్మడి వల్లి మీదుగా ఆంధ్రా లోని వెలేరుపాడు వరకు బస్ సౌకర్యం కలగనుంది.దీంతో మండల వాసులకు ప్రజా రవాణా అందుబాటులోకి రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -