Monday, October 27, 2025
E-PAPER
Homeసినిమా9 నెలల పిల్లాడు ఆత్మగా మారితే?

9 నెలల పిల్లాడు ఆత్మగా మారితే?

- Advertisement -

ఆచార్య క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద ఆనంద్‌ రవి దర్శకత్వంలో భోగేంద్ర గుప్త ప్రొడక్షన్‌ నెం.4గా నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌, గ్లింప్స్‌ను ఆదివారం లాంచ్‌ చేశారు. ఆనంద్‌ రవి, దివి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్‌ రిటర్న్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టైటిల్‌, గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌కు దర్శకులు వశిష్ట, సాయి రాజేష్‌, వంశీ నందిపాటి, అనిల్‌ విశ్వంత్‌ తదితరులు అతిథులుగా విచ్చేశారు. దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ, ‘నేను రవన్న కోసమే వచ్చాను. నీడ పోయిందని ‘నెపోలియన్‌’ తీశాడు. జంతువుల ఆత్మతోనూ కథను రాసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ మూవీ కథ నాకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది.

ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను, వశిష్ట, ఆనంద్‌ రవి మంచి స్నేహితులం. ‘నెపోలియన్‌ రిటర్న్స్‌’ టైటిల్‌ చాలా బాగుంది. ఈ మూవీతో ఆనంద్‌ రవికి పెద్ద విజయం దక్కాలి’ అని మరో దర్శకుడు సాయి రాజేష్‌ అన్నారు. అనిల్‌ విశ్వంత్‌ మాట్లాడుతూ, ‘ఆనంద్‌ రవి రైటింగ్‌ నాకు చాలా ఇష్టం. ఆయన తీసుకునే హుక్‌ పాయింట్‌ చాలా బాగుంటుంది. ఈ స్టోరీ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ, ‘ఆనంద్‌ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఏడాదిన్నర పాటుగా ప్రీ ప్రొడక్షన్‌ కోసమే పని చేశారు.

మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతున్నాం’ అని అన్నారు. హీరో, డైరెక్టర్‌ ఆనంద్‌ రవి మాట్లాడుతూ, ‘ఈ ప్రయాణంలో నాకు గుప్తా ఎంతో సహకరించారు. ‘పేరెంట్స్‌’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్‌’, ‘కొరమీను’ చిత్రాలు తీశాను. నేను అందరికీ తెలుసు. కానీ సరైన సక్సెస్‌, గుర్తింపు రాలేదు. కానీ ‘నెపోలియన్‌ రిటర్న్స్‌’తో నాకు సక్సెస్‌, మంచి గుర్తింపు వస్తుంది. సినిమా అంతా అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్టైనింగ్‌గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు’ అని తెలిపారు. ‘నాకు మంచి పాత్రను ఇచ్చిన ఆనంద్‌ రవికి థ్యాంక్స్‌. ఆయన చెప్పిన కథ నాకెంతో నచ్చింది’ అని దివి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -