నవతెలంగాణ – మిర్యాలగూడ : పట్టణంలోని రైతు బజార్ ను పరిశుభ్రంగా ఉంచి రైతులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంచాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం తెల్లవారుజామున స్థానిక రైతు బజార్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిత్యం వేలాదిమంది ప్రజలు కూరగాయల కోసం రైతు బజార్ కు వస్తుంటారని వారికి ఇబ్బందులు కలగకుండా రైతుబజార్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపై కాకుండా రైతు బజార్ దుకాణాలలోని కూరగాయలు పెట్టుకొని అమ్ముకోవాలని రైతులకు సూచించారు. రైతు బజార్లో నిలువ ఉన్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే రైతులు నేరుగా తమకు తెలపాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంచాలి: ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



