నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ చేపట్టిన వరుస దాడులను వైమానిక దళం తిప్పికొట్టింది. రాత్రి నుండి డ్రోన్లను వైమానిక దళం అడ్డుకుంటోందని, నగరంలోని నాలుగు విమానాశ్రయాల్లో రెండింటిని మూసివేయాల్సి వచ్చిందని రష్యా అధికారులు సోమవారం ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10.00గంటలకు దాడులు ప్రారంభమయ్యాయని, ఐదు గంటల వ్యవధిలో రష్యన్ రక్షణ విభాగాలు 28 డ్రోన్‌లను కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్దదైన డొమోడెడోవో విమానాశ్రయం, జుకోవ్స్కీ విమానాశ్రయాలను 10.40 గంటల నుండి మూసివేసినట్లు రష్యా వైమానిక నిఘా సంస్థ ర ఓసావియాట్సియా తెలిపింది. అయితే ఆస్తి నష్టం గురించిన వివరాలు తెలియాల్సి వుంది.
మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు..తిప్పికొట్టిన రష్యా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



