నవతెలంగాణ – ఆలేరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాలకు మద్యం టెండర్ల పాల్గొన్న ఆశావావుల ఎంపికను సోమవారనాడు లాటరీ ద్వారా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఎంపిక చేశారు. భువనగిరి సర్కిల్లో ఒకటవ నెంబర్ షాపుకు 36 మంది దరఖాస్తు చేసుకోగా అందులో టోకెన్ నెంబర్15 మొట్టమొదటి టోకెన్ నక్కల శ్రీనివాస్ బోనగిరి కి చెందిన వ్యక్తికి కలెక్టర్ తీసిన లాటరీ ద్వారా దక్కింది . రెండవ నెంబర్ షాపుకు 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. దూది కాడి శ్రవణ్ కుమార్ టోకెన్ నెంబర్ 3 అదృష్టం వరించింది. షాప్ నెంబర్ 15 నెంబర్ గౌడ రిజర్వేషన్ షాపుకు ఉత్కంఠ రేపింది. ఎందుకంటే గౌడ రిజర్వేషన్ అయినప్పటికీ 75 దరఖాస్తులు వచ్చాయి. 75 ఈ షాపు పరకాల కిరణ్ టోకెన్ నెంబర్ 15 లాటరీ వరించింది. జిల్లాలోఅత్యధిక దరఖాస్తులు వచ్చిన రామన్నపేట ఎల్లం బావి షాపుకు 91 దరఖాస్తులు వచ్చాయి. ఆరో నెంబరు లాటరీ అండాలు అనే మహిళకు వచ్చింది. ముందుగా ప్రకటించిన డ్రా తేదీ కంటే ఐదు రోజులు లాటరీ తేదీని పొడిగించడంతో జిల్లా వ్యాప్తంగా 200 నుండి 300 వరకు ఆంధ్రావాళ్లు స్వతహాగా మరియు తెలంగాణ వాసులను బినమీగా చేర్చుకొని వారి ద్వారా టెండర్ లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన కూడా ఆంధ్రా వాళ్ళ దోపిడి కొనసాగుతూ.. ఉండడం ఏమిటని టెండర్ లో పాల్గొన్న తెలంగాణకు చెందిన వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 82 షాపులకు2779 దరఖాస్తులు వచ్చాయి కొన్ని షాపులు సిండికేట్ గా వేశారు పెద్ద సంఖ్యలో మద్యం వ్యాపారులు రాయగిరి లోని రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ వద్ద కు చేరారు సివిల్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ భద్రత ఏర్పాట్లు చూశారు.
మద్యం లాటరీ టోకెన్ తీసిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



