Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ పలు ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన ఇంటి నిర్మాణాలను ముగ్గు వేసి పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను సమయానుకూలంగా పనులను ప్రారంభించాలని తెలిపారు. నిర్ణయించిన కాలవ్యవధిలో గృహ నిర్మాణాలు పూర్తిచేసి నిర్మించాలని సూచించారు. గృహ నిర్మాణాలలో ఏవైనా సాంకేతిక సమస్యలు, గ్రామ సమస్యలు, ఇతర సమస్యలు  ఉంటే ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మండల పరిధిలో ఉన్న సమస్యలను తాము పరిష్కరించి నిర్మాణాల పనులను సులభతరంగా జరిగే విధంగా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మంజూరైన గృహ నిర్మాణాలను త్వరితగతిన నిర్మించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు, గృహనిర్మాణాల లబ్ధిదారులు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -