Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరిపొట్ట కొట్టిన అకాల వర్షం..!

వరిపొట్ట కొట్టిన అకాల వర్షం..!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు ప్రతీఏటా కష్టాలు తప్పవడం లేదు.వరి నాటినప్పటి నుంచి పంటచేతికి వచ్చేదాక నష్టపోతూనే ఉన్నారు. వరి నాట్లు వేసిన తరువాత విస్తారమైన వర్షాలు కురవడంతో అల్లాడిన రైతులు ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో కోతకు రాగా మరికొన్ని గ్రామాల్లో పంట పొట్ట దశలో ఉండగా.. భారీ వర్షాలకు పంట నేలవాలుతోంది.యూరియా కొరత, పెరిగిన కూలీతో ఆందోళన చెందుతున్నారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందనే సమయంలో వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది.

ప్రతీఏటా రైతులను అతివృష్టి, అనావృష్టి వెంటాడు తున్నాయి.యూరియా కొరతతో అసలే పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికి వచ్చిన వరి నేల వాలింది.భారీ వర్షాలకు మండలాల్లో పొట్ట దశలో ఉన్న వరికి నష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా 15,500 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు.మరో వైపు యూరియా కొరత కారణంగా వరికి సకాలంలో ఎరువులు వేయలేదు. దీంతో పంట ఆశించిన స్థాయిలో ఎదగలేదు. అలాగే కలుపు మొక్కలు పెరగడంతో పాటు పంటకు ఎండు తేమ, అగ్గి తెగులు వంటి తెగుళ్లు సోకాయి.దీంతో దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -