నవతెలంగాణ – ధర్మసాగర్
నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి అనుబంధం సంఘాల హనుమకొండ ఇంచార్జ్ కందుకూరి సోమన్న మాదిగ, ఎం ఎస్ పి హనుమకొండ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఎమ్మెస్ పి హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగగారి అధ్యక్షతన జరిగిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుభంద సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ.. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద జరిగిన దాడి ముమ్మాటికీ కావాలని జరిగిన దాడి గా ఈ దాడి ముమ్మాటికీ న్యాయ వ్యవస్థ భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై మరియు దళిత సమాజంపై జరిగిన దాడిగా భావించుకుంటూ, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సుమోటగా తీసుకొని దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1న హైదరాబాద్ లో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు ధర్మసాగర్ మండలo నుండి ప్రతి గ్రామo నుండి బస్సులను ఏర్పాటు చేసుకొని అధిక సంఖ్యలో జనం తరలివచ్చి హైదరాబాదులో జరిగే దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు సింగారపు పవన్,వీహెచ్పీఎస్ మండల అధ్యక్షులు మాచర్ల బాబు, నాయకులు మట్టెడ బాలస్వామి,పోలుమారి బాబు,చిలక రాజు,చింత తిలక్,గాదె భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.
దళిత ఆత్మ గౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



