నవతెలంగాణ-జన్నారం
బీజేపీ వైఖరి దొంగే దొంగ అన్నట్లు ఉన్నదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సీపీఐ (ఎం) మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకోవడంతోనే చట్టబద్ధత కాలేదని అన్నారు. ఈనెల 18న జరిగే బంద్ను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ఈ బంద్ సాగాలన్నారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బీసీ సంఘాలు, అభ్యుదయ వాదులు, ప్రజాతంత్ర వాదులు భాగస్వాములు కావాలని కోరారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును, కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఆరు నెలలైనా కేంద్రం స్పందించడంలేదన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు అంబటి లక్ష్మణ్ , మగ్గిడి జయ, నాయకులు ఎస్.కెఅబ్దుల్లా, కూకటికారు బుచ్చయ్య, గుడ్ల రాజన్న పాల్గొన్నారు.
బీసీలకు రిజర్వేషన్ల అమలు బాధ్యత కేంద్రానిదే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



