నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని సాధనపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునీల్ ప్రజ్వల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 125 తెల్లజాతి పశువులకు నల్లజాతి 80 జీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. అనంతరం ప్రజ్వల్ సంస్థ ప్రాజెక్టు యూనిట్ మేనేజర్ మానస మాట్లాడుతూ మూగజీవాలు వాటి బాధలను చెప్పుకోలేవ ని అన్నారు. ముందుగానే రైతులు గుర్తించి నివారణకు టీకాలు వేసుకొని మూగజీవాలను రక్షించు కోవాలని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రమేష్ బాబు, రవి, సదానందం, గ్రామ రైతులు నవయుగ సొసైటి డైరెక్టర్ జంగ సమ్మయ్య, ప్రజ్వల్ ప్రతినిధి రవిచందర్, శ్రీనివాస్, హరిచంద్రు, సాంబయ్య, శ్రీను, రాజు, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
సాధనపల్లిలో పశువైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



