ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల తహసిల్దార్ సురభి మహేష్ కుమార్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాష్ట్రంలో మూడు రోజుల పాటు తుఫాను కారణంగా భారీ వర్షాలు ఉండటంతో సిరిసిల్ల పట్టణ ప్రజలు, మండల రైతులు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల తహసిల్దార్ సురభి మహేశ్ కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల లో సోమవారం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం తుకం వేసినట్లయితే వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రాలలో ఆరబోసిన ధాన్యమును కుప్పలుగా పోసి టార్పాలిన్ లు కప్పాలని ధాన్యం కిందకు మీరు వెళ్లకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాలని తాహసిల్దార్ కోరారు. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉండడంతో వర్షాలు తగ్గేవరకు రైతులు హార్వెస్టర్ తో కోతలు ఆపాలని ఆయన కోరారు. రైతులు ముందు జాగ్రత్తలు పాటించి పంట నష్టం కాకుండా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
మూడు రోజులు తుఫాన్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



