Wednesday, October 29, 2025
E-PAPER
Homeజిల్లాలుఆగ్రహంతో పత్తిని తగలబెట్టిన రైతులు

ఆగ్రహంతో పత్తిని తగలబెట్టిన రైతులు

- Advertisement -

తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర కోసం రాస్తారోకో 
నవతెలంగాణ – నకిరేకల్ 

తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చి పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం నకిరేకల్ – అర్వపల్లి రహదారిపై పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ బీఆర్ ఆర్ కాటన్  మిల్లుకు తీసుకొచ్చిన పత్తిని తేమశాతం ఎక్కువగా ఉందన్న సాకుతో  వెనక్కి పంపించడం వల్ల రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ ఆగ్రహంతోనే రహదారిపై పత్తిని వేసి తగలబెపెట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. అకాల వర్షాలతో పత్తి తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను సిసిఐ అధికారులు మరింత ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదన్నారు. పంట పండించడం కత్తి మీద సాముల మారిందని, అమ్మడం అంతకుమించి భారంగా పరిణమించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల కష్టాలను అర్థం చేసుకొని తేమశాతంతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తీగల వెంకన్న, సత్యనారాయణ, శంకర్ ,సైదులు, నజీర్, యాదయ్య, బలరాం, గంగమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -