Wednesday, October 29, 2025
E-PAPER
Homeజాతీయంస‌ర్..ప్రజాస్వామ్యానికి ముప్పు: సీఎం పినరయి విజయన్‌

స‌ర్..ప్రజాస్వామ్యానికి ముప్పు: సీఎం పినరయి విజయన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కేరళ, ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను చేపట్టాలనే భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్‌ తీవ్రంగా విమర్శించారు. ఈ చర్య ”ప్రజాస్వామ్యానికి ముప్పు” అని మండిపడ్డారు. ఈసీఐ ప్రకటనను విమర్శిస్తూ మంగళవారం విజయన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చర్య ఈసీపై సందేహాలను లేవనెత్తుతోందని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

ప్రస్తుత ఓటర్‌ జాబితాలకు బదులుగా 2002 నుండి 2004 వరకు ఉన్న ఓటర్ల జాబితాల ఆధారంగా సవరణ చేయడానికి ఈసీఐ సన్నాహాలు చేస్తోందని, ఇది 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1960 ఓటర్ల జాబితా నిబంధనలను ఉల్లంఘించడమేనని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఓటరు జాబితా ఆధారంగా నవీకరణ చేయాలని చట్టాలు స్పష్టంగా సూచిస్తున్నాయని అన్నారు.

కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నందున ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) అసాధ్యమని రాష్ట్ర ఎన్నికల అధికారి ఇప్పటికే ఐసీఐకి తెలియజేసినట్లు విజయన్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి హెచ్చరించినప్పటికీ.. ఈ దశలో ఎస్‌ఐఆర్‌ చేపట్టడం, ఈసీ తీరుపై అనుమానాలను లేవనెత్తుతోందని అన్నారు.

2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ సహా 12 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత పాలిత రాష్ట్రాల్లో నవంబర్‌, ఫిబ్రవరి నెల‌ల్లో ఎస్‌ఐఆర్ రెండో దశ చేపట్టనున్నట్లు ఈసీఐ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -