Tuesday, October 28, 2025
E-PAPER
Homeజిల్లాలురెటినోపతితో అంధత్వ నివారణ

రెటినోపతితో అంధత్వ నివారణ

- Advertisement -

నివారణకు వంద రోజులు ప్రణాళికలు
జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
నవతెలంగాణ – వనపర్తి

రెటినోపతి (రేటినో స్కోపి అత్యాధునిక సాంకేతిక పరికరం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనే వ్యాధి మధుమేహం వ్యాధిగ్రస్తులకు సోకి క్రమంగా అందత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని, అందువల్ల ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి వైద్యము చేయడం ద్వారా నివారించవచ్చని, అందుకు మెడికల్ కళాశాల ఆప్తాలమాలజీ డిపార్ట్మెంట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా 100 రోజుల స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ కళాశాల ఆప్తాల మాల జి డిపార్ట్మెంట్ ఇన్చార్జితో రెటినోపతి వ్యాధి నివారణపై సమీక్ష నిర్వహించారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు రెటినోస్కోపీ అనే అత్యాధునిక సాంకేతిక పరికరాన్ని వనపర్తి జిల్లాకు అవసరమైన మేరకు కొనుగోలు చేసి నవంబర్ 14 నుండి 100 రోజులపాటు పి.హెచ్.సి వారిగా గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం ఇంటింటికి తిరిగి మధుమేహం వ్యాధిగ్రస్తులకు రెటినోపతి వైద్య పరీక్షలు నిర్వహించాలని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.

గత సంవత్సరంలో జిల్లాలోని ఇంటింటికి వెళ్లి 30 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించి దాదాపు 20,000 మంది మధుమేహం వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగిందని, వారందరికీ ఒక షెడ్యూల్ ప్రకారం గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇందులో పాజిటివ్ వచ్చినవారికి గుర్తించి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని అవసరమైన వారికి సరోజినీ హాస్పిటల్ లేదా ఎల్వీ ప్రసాద్, పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ కు సిఫారసు చేయాలని సూచించారు. 

ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసి వనపర్తి జిల్లాలో ఏ ఒక్కరూ రెటినోపతి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. జిల్లా మెడికల్ కళాశాల ఆప్తల్ మాలజీ విభాగము మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలోనే ఈ వంద రోజుల వైద్య పరీక్షల కార్యాచరణ ప్రక్రియ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామచంద్రరావు, నోడల్ అధికారి డాక్టర్ రియాశ్రీ, ఆప్తాలమాలజీ హెచ్.ఓ. డి డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -