Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా యూసుఫ్గూడ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్చార్జిగా ఉన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడపగడపకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణి చేసి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఓటర్లకు వివరించారు. సన్న బియ్యం పంపిణి, నూతన రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను అందించి పేదలను ఆదుకుంటుందన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ ప్రజలందరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -